భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, దుబాయ్ వాతావరణం పిచ్ స్లోగా ఉంటుందని, పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.ప్రస్తుతం అక్కడ వెదర్ రిపోర్ట్ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడు 2.30 అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అదే టైమ్‌కి స్టార్ట్ అవుతుంది కానుక. మీరు కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారా.కొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో దిగబోతుంది. ప్రస్తుతం దుబాయ్ వెదర్ ఎలా ఉంది? పిచ్ రిపోర్ట్ ఏంటి రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటాడా . ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందా.బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లానే ఇది కూడా స్లో పిచ్‌పైనే జరుగుతుందా.
వెదర్ రిపోర్ట్
దుబాయ్ వెదర్ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం అక్కడ వెదర్ రిపోర్ట్ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. మబ్బులేం లేకుండా.. ఆకాశమంతా చాలా క్లియర్‌గా ఉంది. సో వర్షం వచ్చే అవకాశం లేదు. మ్యాచ్‌కు వర్షంతో వచ్చిన గండమేమి లేదు. అలాగే ఈ రోజు అక్కడ రోజు ఉండేంత వేడి ఉండకపోవచ్చు. కాస్త చల్లగానే ఉంటుండటంతో రాత్రి పూట డ్యూ కూడా రాదని వాతావరణ నిపుణులు అంటున్నారు.టాస్ సమయంలో కీలకంగా మారే అంశం. టాస్ గెలిస్తే ముందు ఏం చేయాలనే డ్యూ వస్తుందా? రాదా? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పగలు ఎక్కువ వేడిగా ఉంటే రాత్రి డ్యూ వస్తుంది. పగలు చల్లగా ఉంటే రాత్రి డ్యూ రాదు. సో దుబాయ్‌లో ఈ రోజు డ్యూ వచ్చే ఛాన్స్ తక్కువ.

పిచ్ స్లోగా ఉండి, పేసర్లు మరియు స్పిన్నర్లకు సహకరిస్తుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ చేయడం సవాలు కావచ్చు, కాబట్టి పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయడం కీలకం. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్ ఉంటుందని సమాచారం. ముందుగా పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి. పవర్ ప్లేలో మాత్రం వేగంగా పరుగులు చేయాలి.