లాస్ ఏంజెలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఆసక్తిగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు వెలువడాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వంటి ప్రధాన విభాగాలకు సంబంధించిన నామినేషన్లు ఆస్కార్ అకాడమీ తాజాగా ప్రకటించింది. మార్చి 27న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.
ఉత్తమ చిత్రం
- అనోరా
- ది బ్రూటలిస్ట్
- ఏ కంప్లీట్ అన్ నోన్
- కాంక్లేవ్
- డూన్: పార్ట్ 2
- ఎమిలియా పెరెజ్
- అయాం స్టిల్ హియర్
- నికెల్ బాయ్స్
- ది సబ్ స్టాన్స్
- విక్ డ్
ఉత్తమ దర్శకుడు
- షాన్ బేకర్ – అనోరా
- బ్రాడీ కోర్ బ్రెట్ – ది బ్రూటలిస్ట్
- జేమ్స్ మాన్ గోల్డ్ – ఏ కంప్లీట్ అన్ నోన్
- జాక్వెస్ అడియార్డ్ – ఎమిలియా పెరెజ్
- కొరేలీ ఫార్జీట్ – ది సబ్ స్టాన్స్
ఉత్తమ నటుడు
- ఆడ్రియన్ బ్రాడీ – ది బ్రూటలిస్ట్
- తిమోతీ చలామెట్ – ఏ కంప్లీట్ అన్ నోన్
- కొల్మన్ డొమింగో – సింగ్ సింగ్
- రాల్ఫ్ ఫైనెస్ – కాంక్లేవ్
- సెబాస్టియన్ స్టాన్ – ది అప్రెంటిస్
ఉత్తమ నటి
- సింథియా ఎరివో – విక్ డ్
- కార్లా సోఫియా గాస్కన్ – ఎమిలియా పెరెజ్
- మికీ మ్యాడిసన్ – అనోరా
- డెమీ మూర్ – ది సబ్ స్టాన్స్
- ఫెర్నాండా టోరెస్ – అయాం స్టిల్ హియర్
ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ కెమెరామన్, ఉత్తమ సంగీతం, ఉత్తమ గీతం, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లో పలు విజయవంతమైన చిత్రాలు నామినేషన్ పొందాయి.ఈ సంవత్సరం నామినేషన్లలో కొత్తదనంతో పాటు విభిన్న కంటెంట్‌కు ప్రాధాన్యతను చూపించడం విశేషం. మార్చి 27న జరగబోయే ఈ మహా వేడుకలో ఎవరి పేర్లు చిరస్థాయిగా నిలుస్తాయో చూడాలి!