పాకిస్తాన్ (Pakistan ) లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జులై 8న బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) ‘ఆపరేషన్ బామ్’ ప్రారంభించి నాలుగు రోజుల్లోనే 70కి పైగా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడులలో పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
బలూచిస్థాన్ ఖనిజ సంపదపై పాక్-చైనా దోపిడీ
బలూచిస్తాన్ (Balochistan) ప్రాంతంలో నేచురల్ గ్యాస్, నూనె, ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ వనరులను పాకిస్థాన్ ప్రభుత్వం చైనా కంపెనీలకు అప్పగించి దోపిడీ చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయుధాన్ని ఎత్తిపట్టే దిశగా బలూచ్ మిలిటెంట్లు ముందుకెళ్తున్నారు.
స్వాతంత్ర్యం కోసం పోరాటం
బలూచిస్తాన్ ప్రజలు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతున్నారు. తమ భూములు, వనరులు తమకు కావాలని, ఇక పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కావాలని బలూచ్ ఉద్యమకారులు స్పష్టంగా చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వేర్పాటువాదం బలపడుతున్నప్పటికీ.. తాజా “ఆపరేషన్ బామ్”తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది పాక్ ఆర్మీకి పెద్ద సవాలుగా మారింది.
Read Also : Trump : 1300 మంది అధికారులను తొలగిస్తున్న ట్రంప్!