దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన సరైనదేనని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 60 రోజుల్లోపు దక్షిణ కొరియాలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో అభిశంసన ఎదుర్కొని పదవి పోగొట్టుకున్న యూన్‌కు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పూ వ్యతిరేకంగా వచ్చింది. 2022లో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యూన్ అసలు పార్లమెంటులో అభిశంసన ఎదుర్కొనే పరిస్థితి ఎలా వచ్చింది? ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి ? భార్యకు గిఫ్ట్ రూపంలో వచ్చిన బ్యాగ్ యూన్ రాజకీయ జీవితాన్ని ఎలా మార్చివేసింది?
లగ్జరీ బ్యాగ్ వివాదమేంటి?
గత ఏడాది యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఆయన భార్య కిమ్ కియోన్ హీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కిమ్ కియోన్ హీ ఒక లగ్జరీ బ్యాగ్‌ను బహుమతిగా స్వీకరించారనే వివాదం పాలక పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ)ని ఏడాదిన్నర క్రితం గందరగోళంలో పడేసింది. 2023 చివర్లో బయటకు వచ్చిన స్పై కెమెరా ఫుటేజ్‌లో ఒక పాస్టర్ ఆమెకు డియోర్ అనే బ్రాండెడ్ బ్యాగ్‌ను బహుకరిస్తున్నట్టు కనిపించింది. ఈ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.

వామపక్ష యూట్యూబ్ చానల్ వాయిస్ ఆఫ్ సోల్ ప్రసారం చేసిన ఈ వీడియోను పాస్టర్ చోయ్ జే-యంగ్ తన వాచ్‌లో ఉన్న కెమెరాను ఉపయోగించి రహస్యంగా చిత్రీకరించినట్టు ప్రచారం జరిగింది. .
పాస్టర్ చోయ్ ఒక దుకాణానికి నడుచుకుంటూ వెళ్తున్నట్టు, బూడిద-నీలం రంగు లెదర్ బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించింది. దాని ధర 3 మిలియన్ వోన్ (దాదాపు రూ. 1.75 లక్షలు ) అని రసీదు ఉంది. ఆ బ్యాగ్‌ను 2022 సెప్టెంబర్‌లో కిమ్‌కు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
READ ALSO: Apple: అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు