The accident should be investigated by the sitting judge.. Harish Rao

ప్రమాదంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ : హరీష్ రావు

హైదరాబాద్‌: తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది మీ కాంగ్రెస్ నాయకులు కాదా.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారు.

Advertisements
ప్రమాదంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ

దోషులు ఎవరో తేల్చు..

కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యు కుహరంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలితీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారు. నీకు నిజాయితీ ఉంటే SLBC ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు! దోషులు ఎవరో తేల్చు. పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్. ఒర్రితే పనులు కావు ఒళ్ళు వంచి పని చేస్తే పనులవుతాయి. 15 నెలలు అయినా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం.

ఎస్‌ఎల్‌బీసీ వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్సీ ఓట్ల కోసం

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ కూతురు పెండ్లికి దుబాయ్‌ వెళ్లిన తనపై విలసాలు, విందులకోసం వెళ్లానని అభాండాలు వేయడం ఆయన నీచత్వానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. ‘రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలానికి వెళ్లకుండా ఓట్లకోసం హెలికాప్టర్‌లో ప్రచారానికి పోయింది వాస్తవం కాదా? హెలికాప్టర్‌ లేదనే కారణంతో నీటిపారుదల శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నది నిజం కాదా?’ అంటూ ఆదివారం ఎక్స్‌ వేదికగా ప్రశ్నాస్ర్తాలు సంధించారు.

Related Posts
Citizenship Case : ఆది శ్రీనివాస్ కు జరిమానా చెల్లించిన చెన్నమనేని
Aadi srinivas

పౌరసత్వ వివాదం నేపథ్యంలో ప్రముఖ BRS మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జరిమానా చెల్లించారు. వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్‌పై Read more

Mujra Party :రంగారెడ్డి గ్రామ శివార్లో ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ ని భగ్నం చేసిన పోలీసులు
Mujra Party :రంగారెడ్డి గ్రామ శివార్లో ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ ని భగ్నం చేసిన పోలీసులు

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ కలకలం – ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ దాడులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్‌పల్లి శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో జరుగుతున్న Read more

ఏపీ సర్కార్ బాటలో తెలంగాణ సర్కార్
TG Inter Midday Meals

తెలంగాణ ప్రభుత్వం..ఏపీ ప్రభుత్వ బాటలో పయనిస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణ పథకాలను, తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏపీ సర్కార్ అనుసరిస్తే..ఇప్పుడు ఏపీలో Read more

Narendra Modi : శ్రీలంక టీమ్ తో ప్రధాని మోదీ ముచ్చట్లు
Narendra Modi శ్రీలంక టీమ్ తో ప్రధాని మోదీ ముచ్చట్లు

శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక సంఘటనకు సాక్షిగా నిలిచారు.1996 వన్డే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా Read more

Advertisements
×