trump

బానిసలకే ఆ ఆఫర్.. తేల్చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ తీసుకున్న జన్మతః పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు డెమోక్రాట్లు కోర్టును ఆశ్రయించడంతో దాని అమలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్.. అసలు జన్మతః పౌరసత్వం ఎందుకు తన దేశం తీసుకొచ్చిందో వెల్లడించారు. అమెరికాలో బానిసల పిల్లలకు వర్తించేలా గతంలో జన్మతః పౌరసత్వ నిబంధన తీసుకొచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వారి పిల్లలకు హక్కులు కల్పించాలనే దీన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అంతే కానీ ఇతర దేశాల జనం అంతా వచ్చి అమెరికాలో పోగు పడేందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే తాను జన్మతః పౌరసత్వ నిబంధనను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్దమని తేల్చిచెప్పేశారు.

మరోవైపు జన్మతః పౌరసత్వం దుర్వినియోగం అవుతోందని, దీని వల్ల ఇతర దేశాల వారు, అర్హత లేని పిల్లలు పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ చట్టం గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిందని ట్రంప్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని తేల్చిచెప్పేశారు. కాబట్టి తన ప్రభుత్వం జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, అక్కడ వంద శాతం తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుటికే ట్రంప్ సర్కార్ పలు దేశాలకు చెందిన వలసవాదుల్ని విమానాల్లో వారి స్వదేశాలకు పంపేస్తోంది. అలాగే స్థానికంగా వీసాల జారీ విషయంలో పలు మార్పులు చేస్తున్నారు. దీని ప్రభావం భారత్ తో పాటు పలు దేశాలపై కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఇక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు జన్మతః పౌరసత్వంపై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి.

Related Posts
తైవాన్ రాజకీయాల్లో పెద్ద సంచలనం..
Former Taipei Mayor Ko Wen je Faces Charges

తైవాన్ రాజకీయాల్లో ఒకప్పుడు అత్యంత ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి అయిన కో వెన్-జే, 65 సంవత్సరాల వయస్సులో అవినీతి ఆరోపణలపై గురువారం అభియోగాలను ఎదుర్కొన్నారు. కో వెన్-జే, Read more

రైల్వే బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?
రైల్వే బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?

భారతీయ రైల్వేలు దేశం కోసం ఎంతో కీలకమైన వ్యవస్థ. ప్రతి బడ్జెట్‌లో కూడా రైల్వే కోసం పెద్ద ప్రకటనలు వచ్చే ఆశ ఉండేది. కానీ ఈసారి పరిస్థితి Read more

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్
technology company

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల Read more

Delhi Government : మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు
Delhi Government మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు

Delhi Government : మరో ప్రాంతానికి తరలిపోనున్న తీహార్ జైలు ఆసియాలోనే అత్యంత పెద్ద జైలుగా పేరుగాంచిన తీహార్ జైలులో ఖైదీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కరడుగట్టిన Read more