అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్‘ నుంచి ట్రైలర్ వచ్చింది. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయబోతుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ , టీజర్ ఆకట్టుకోగా..ఇప్పుడు ఈ ట్రైలర్ సీనిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సాయి పల్లవి, నాగ చైతన్య జోడికి, వారి కెమిస్ట్రీకి, ఆ లవ్ ట్రాక్‌కు యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలానే ఉంది.
![thandel2](https://vaartha.com/wp-content/uploads/2025/01/thandel2.jpg.webp)
మన గురించి మాట్లాడుకుంటున్నారంటే.. మనం ఫేమస్ అయిపోయినట్లే.. అనే డైలాగ్ ఈ ట్రైలర్‌లో అదిరిపోయేలా ఉంది. ఇక ప్రేమతో పాటుగా దేశ భక్తిని చాటే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండేట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య లుక్స్, యాక్టింగ్ సరి కొత్తగా ఉండబోతోన్నాయని ట్రైలర్ చెబుతోంది. ఇక సాయి పల్లవి మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ‘మా దేశంలో ఉన్న ఊరకుక్కలన్ని ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోయిద్ది’ అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. మా యాసని ఎటకారం చేస్తే.. రాజులమ్మ జాతరే అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రమాదం అని తెలిసినా తన మంది కోసం ముందుకు అడుగు వేసేవాడే తండేల్ అని అసలు అర్థాన్ని ట్రైలర్‌లో చెప్పేశారు. తండేల్ అంటే ఓనరా? అని అడిగితే.. కాదు సర్ లీడర్ అని అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేశారు.