అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మూవీ ‘తండేల్‘. ప్రేమమ్ ఫేమ్ చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, వాలెంటైన్ వీక్ సందర్భంగా ఈరోజు 2025 ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ నిర్మించడం విశేషం. సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ ఆకట్టుకోగా..సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో..పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం.

తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు. తండేల్ సినిమా నాగచైతన్యకు కమ్ బ్యాక్ మూవీ. ఆ సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్, చూపించిన యాక్టింగ్ నిజంగా ప్రశంసనీయం అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొంటాడు. ప్రీ క్లైమాక్స్‌లో నాగచైతన్య క్యారెక్టర్ గురించి పాకిస్థానీ పోలీసులు ఇచ్చే ఎలివేషన్ బాగుంది. వాడు రాడు ఎందుకంటే.. ప్రాంతం ఏదైనా ప్లేస్ ఏదైనా వాడు తండేల్ అనే డైలాగ్ అదిరిపోయింది. ఆ సీన్‌కు డీఎస్పీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.