తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ కస్టడీ మరణాలపై పెద్ద దుమారం రేగింది. ఇటీవల పోలీసు కస్టడీలో మృతి చెందిన ఆలయ సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళగ వెంట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు ఇళయతలపతి విజయ్ స్వయంగా భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఆయన పార్టీ అధికారికంగా ప్రారంభించిన తర్వాత నిర్వహించిన మొదటి ప్రజా నిరసన కావడం గమనార్హం.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, “డీఎంకే ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నియంత్రణ కోల్పోయిందని, ప్రజల భద్రతకంటే అధికార దుర్వినియోగమే ఎక్కువైందని” తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసు కస్టడీలో పౌరులు చనిపోవడం దారుణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వం నుంచి మనకు లభించే గరిష్ట సమాధానం ‘క్షమించండి మా’ అని విజయ్ ఎద్దేవా చేశారు.
క్షమించాల్సిన
అన్నా యూనివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు ఈ పాలనలో ఎన్ని దారుణాలను చూడాల్సి వస్తుందో. కోర్టులే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. నల్ల చొక్కా ధరించి ‘క్షమించాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం కావాలి’ అనే ప్లకార్డును పట్టుకున్న విజయ్, డీఎంకే (DMK) పాలనలో 24 మంది కస్టడీలో మరణించారని పేర్కొన్నారు. వారందరికీ మీరు క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. వారికి కూడా క్షమాపణలు చెప్పాలని, అజిత్ కుమార్‌కు ఇచ్చినట్టే ఆ 24 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు.
అజిత్ కుమార్ కేసు నేపథ్యం
శివగంగలోని మాదపురం కాళీ అమ్మాన్ ఆలయంలో 29 ఏళ్ల సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ను ఆభరణాల దొంగతనం కేసులో ప్రశ్నించడానికి జూన్ 27న పోలీసులు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో “చనిపోయినట్టు” ప్రకటించారు. పోలీసులు మొదట్లో అతనికి మూర్ఛ వ్యాధి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో 44 గాయాలు, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం అయినట్టు తేలింది. దీంతో ఇది కస్టడీ మరణంగా నిర్ధారించారు. ఈ కేసు తమిళనాడు రాజకీయాల (Tamil Nadu Politics) ను వేడెక్కించింది. కస్టడీలో హింసకు గురైన 18 మంది కుటుంబాలను విజయ్ కలిసిన తర్వాత ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు.
తమిళ నంబర్ 1 సూపర్‌స్టార్ ఎవరు?
మిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్‌ను నిజమైన “సూపర్‌స్టార్”గా పరిగణిస్తారు. విజయ్, కమల్ హాసన్, అజిత్ కుమార్ వంటి టాప్ హీరోలు ఉన్నా, రజనీకాంత్‌కు ఉన్న అపారమైన ఫాలోయింగ్, దశాబ్దాలుగా కొనసాగుతున్న Stardom వల్ల ఆయనే నంబర్ 1 సూపర్‌స్టార్‌గా నిలిచారు. తమిళ సినిమా చరిత్రలో ఆయనకున్న స్థానం ప్రత్యేకమైనది.
తమిళంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరు?
ప్రస్తుతానికి తలపతి విజయ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్లిన వ్యక్తి..కారణమిదే?