తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, ఉదయానికి సాధారణ వాతావరణం ఉండి సాయంత్రం సమయానికి మబ్బులు పొరబడటం, ఆ తర్వాత కుండపోత వానలు (squalls / heavy showers) రావటం ఈ మూడు రోజులుగా తరచుగా చూస్తున్నాం.నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలు, నివాసానికి అనుకూలంగా లేక జనాలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
మరి నేడు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతుంది.. ఇవాళ కూడా వర్షం కురుస్తుందా.. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారంటే..తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి బాగా ఎండ కాస్తుందని.. పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం (the weather) పొడిగా ఉంటుందని.. 5 గంటల తర్వాత ఆకాశం మేఘావృతం అవుతుందని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలయ్యి.. క్రమంగా పెరుగుతూ.. రాత్రి 7 గంటల ప్రాంతానికి రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో వాన కురుస్తుందని
శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత (Hyderabad) లోనూ మోస్తరు వర్షం కురుస్తుందని.. అప్పుడు ప్రారంభమైన వాన తెల్లవారు జామున 3 గంటల వరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలానే శుక్రవారం నాడు తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో వాన కురుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తూర్పు తెలంగాణ ప్రాంతంలో కాస్త తక్కువ వర్షం కురుస్తుందన్నారు.
ఇక నగర వాసులు నేడు కూడా అప్రమత్తంగా ఉండాలని.. వాతారణంలో ఉన్నట్లుండి మార్పులు వస్తాయి కనుక.. బయటకు వెళ్లే పనులు ఉంటే సాయంత్రం వరకు పూర్తి చేసుకుని.. తిరిగి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నేడు కూడా నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి.. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని చెబుతున్నారు.
మోస్తరు వానలు కురిసే అవకాశం
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ (Telangana) లో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. ఇక గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.
గురువారం సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు కొనసాగింది. దీంతో జూబ్లీహిల్స్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, బోరబండ, చార్మినార్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని చెరువులను తలపించాయి. రహదారుల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: