నేడు తెలంగాణలో జరగవలసిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. దీనికి కారణం
ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదాపడింది. ప్రస్తుతం సిఎం
రేవంత్రెడ్డి (CM Revanth Reddy), మరో ఐదుగురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం తన పర్యటననుముగించుకుని, హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు. ఈ సమావేశం ఈనెల 28నమధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంబంధిత మంత్రులు తెలిపారు.

ఢిల్లీకి వెళ్లినవారు ఎవరనగా..
ఒబిసి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ, వాకిటి శ్రీహరి,
డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క (Deputy CM Batti Vikramarka), ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, సిఎం రేవంత్రెడ్డిలు ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్, ఖర్గేలతో సమావేశమై పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుకుఆమోదం లభించేలా చూడాలని కోరారు. బీజేపీ ఈ బిల్లును అడ్డుకునేందుకు అడుగడుగునాప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరోవైపు గవర్నర్ జిష్ణుదేవవర్మ (Governor Jishnu Deva Varma) బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ నుకేంద్ర హోంశాఖకు పంపించారు.
తెలంగాణ సంస్కృతిలో ఏమి ప్రత్యేకత ఉంది?
తెలంగాణలో బతుకమ్మ, బోనాల వంటి సంప్రదాయ పండుగలు,పద్యాల పద్ధతిలో పల్లె పాటలు, జానపద కళలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతాయి.
తెలంగాణలో ప్రసిద్ధ హస్తకళలు (Handlooms) ఏమిటి?
తెలంగాణలో పోచంపల్లి ఇకత్ (Pochampally Ikat), గద్వాల్ చీరలు (Gadwal Sarees), నరాయణపేట చీరలు అత్యంత ప్రసిద్ధమైనవి. ఇవి దేశవ్యాప్తంగా పేరు గాంచిన వస్త్రాలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Banakacharla: బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ