Tet hall tickets released

టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ టీజీ టెట్‌ 2025 పరీక్షలు జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. TS TET Hall Ticket 2024 విడుదలయ్యాక ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్‌ పేపర్‌–1ను ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు– 150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–1 (30 ప్రశ్నలు– 30 మార్కులు), లాంగ్వేజ్‌–2 (30 ప్రశ్నలు– 30 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (30 ప్రశ్నలు– 30 మార్కులు), ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (30 ప్రశ్నలు – 30 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో 6 ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి.

కాగా, విద్యాశాఖ ఇప్పటికే ప్ర‌క‌టించిన టీజీ టెట్‌ పూర్తిస్థాయి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే సంవ‌త్స‌రం 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది.

Related Posts
నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా డీజీపీ గారూ..? కేటీఆర్ ప్రశ్న
BRS held a huge public meeting in April 27

హైదరాబాద్‌: ఆ రైతును నేను కూడా కలిశాను… అతనితో మాట్లాడాను… మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Read more

వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు
వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు Read more

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్
raghuram pawa

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ Read more

నాడు ఫుల్లుగా ఎరువు.. నేడు కరువు! : కేటీఆర్
ktr comments on congress govt

కేసీఆర్‌ వ్యూహంతో రైతులకు తప్పిన ఎరువుల తిప్పలు హైదరాబాద్‌: ఏడాది క్రితం వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎరువులు దొరికేవి. కేసీఆర్‌ హయాంలో రైతులు ఇలా వెళ్లి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *