ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ టెస్లా, భారత మార్కెట్‌పై దృష్టిసారించింది. ఇప్పటికే ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు దేశ రాజధానిలో రెండో షోరూమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ‘టెస్లా (Tesla) ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను ఢిల్లీలోని ఏరోసిటీలో నిర్మిస్తున్నారు.ఏరోసిటీలోని ఖరీదైన వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఆగస్టు 11న షోరూమ్ తెరతీయనుంది (The showroom will open on August 11 at the Worldmark 3 complex) .ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని టెస్లా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే పనులు తుదిదశకు చేరగా, బిల్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ షోరూమ్ కోసం టెస్లా భారీ ఖర్చుకు వెళుతోంది. వరల్డ్‌మార్క్ 3లో స్పేస్ అద్దెకు నెలకు సుమారు రూ. 25 లక్షలు చెల్లించనుంది. ఇది టెస్లా seriousnessను తెలిపే సూచిక. ఢిల్లీ ఎన్సీఆర్‌లోని వినియోగదారులపై కంపెనీకి ఉన్న నమ్మకాన్ని ఇది నిబద్ధంగా చూపుతోంది.

ముంబై షోరూమ్‌తో భారత్‌లో ఆరంభం
గత నెల జూలై 15న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తొలి షోరూమ్ తెరచిన విషయం తెలిసిందే. మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు మంచి స్పందన లభించింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఈ ప్రారంభోత్సవానికి హాజరై, పరిశ్రమల పెరుగుదలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ప్రస్తుతం భారత మార్కెట్‌లో టెస్లా ఒక్క మోడల్ మాత్రమే విక్రయిస్తోంది. అదే ‘మోడల్ వై’. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి మొదలవుతోంది. రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది—ఒకటి స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్, మరొకటి లాంగ్-రేంజ్.
ఛార్జింగ్‌లో టెస్లా సత్తా
స్టాండర్డ్ వేరియంట్ 60kWh బ్యాటరీతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లాంగ్-రేంజ్ వేరియంట్ 75kWh బ్యాటరీతో 622 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. భారత రోడ్లకు తగినంత రేంజ్ ఉండటం వినియోగదారులకు ఆకర్షణగా మారుతోంది.మొదటి దశలో టెస్లా ముంబై, పుణె, ఢిల్లీ, గురుగ్రామ్‌లోనే డెలివరీలు అందిస్తుంది. కార్లను నేరుగా వినియోగదారుల ఇంటికే ఫ్లాట్‌బెడ్ ట్రక్కుల ద్వారా పంపనుంది. ఇది వాహనం కొనుగోలుదారులకు added advantage అవుతుంది.
వెబ్‌సైట్‌లో అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం
తెలంగాణ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని టెస్లా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రానుసారంగా ట్యాక్స్ లెక్కలతో కస్టమర్‌కు స్పష్టత లభించేలా ప్లాట్‌ఫామ్ రూపొందించారు.అదనంగా రూ. 6 లక్షలు చెల్లిస్తే లభించే ‘ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్’ ఫీచర్‌ను కూడా త్వరలో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టెక్నాలజీ ప్రియులకు ఇది మంచి అప్డేట్.
Read Also : Team India : డబ్ల్యూటీసీ పట్టికలో దూసుకుపోయిన టీమిండియా