हिन्दी | Epaper

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

sumalatha chinthakayala
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు

శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సుందర్‌బని మల్లా రోడ్డు వద్ద ఫాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి

అదనపు బలగాలు

సుమారు రెండు రౌండ్లు ఫైరింగ్‌ జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు. కాగా, సరిహద్దు సమీపంలోని ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు సాధారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వాహనంపై కాల్పుల సంఘటన నేపథ్యంలో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ జరుగుతున్నదని వెల్లడించారు.

పాకిస్థాన్‌ చొరబాటుదారుడు

మరోవైపు పంజాబ్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ చొరబాటుదారుడ్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. పఠాన్‌కోట్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్‌ చొరబాటుదారుడ్ని గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు అతడ్ని వారించాయని, అయినప్పటికీ చొరబాటుకు యత్నించగా కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

📢 For Advertisement Booking: 98481 12870