Paper leak: పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్‌పేపర్‌లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్‌లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్‌చల్ చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు
మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొని నకిరేకల్‌లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.