కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కనీస ధరను రూ. 11,781 గా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటా మిర్చికి ఈ ధర వర్తిస్తుంది. ధరలు భారీగా పడిపోవడంతో రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఇక నుంచి సాగు ఖర్చు.. అమ్మకపు వ్యయం మధ్య వ్యత్యాన్ని కేంద్రం చెల్లిస్తుంది.

నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో
మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. 2.58లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర ప్రకటించింది.
మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు
కాగా, ఇటీవల మద్దతు ధర లభించడం లేదని మిర్చి రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరింది. అంతలోనే మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు పలికారు. మొత్తం మీద ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదని కొందరు అంటుండగా, మరికొందరు జగన్ పర్యటనతోనే కేంద్రం స్పందించిదని సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం.