peoples fires on the congre

గ్రామసభల్లో ప్రజాగ్రహం

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాపై అధికారులు చేపట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఎలా ప్రకటించిందంటూ ప్రజలు ప్రశ్నించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు, భూస్వాములకు పథకాలు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలా గ్రామాల్లో సభలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇదే క్రమంలో కేటీఆర్ సైతం కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందంటూ ట్వీట్ చేసారు.

మోసకారి కాంగ్రెస్ సర్కారుపై
ప్రజాతిరుగుబాటు మొదలైంది..

గ్యారెంటీల గారడీపై
జనగర్జన షురూ అయింది

అసమర్థ ముఖ్యమంత్రి
అసలు స్వరూపం బట్టబయలైంది

ఇక కాలయాపనతో కాలం సాగదు
అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు

ఈ దరఖాస్తుల దందా నడవదు
ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు

నమ్మించి చేసిన నయవంచనకు
నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు
అట్టుడికిన గ్రామసభల సాక్షిగా

గ్రామసభలా…ఖాకీల క్యాంప్ లా!?
సంక్షేమ పథకాల కోసమా..కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?

ఖాకీల దౌర్జన్యాలు..
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!

పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?

ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?
ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?

పోలీసుల నడుమ.. అంక్షల నడుమ..పథకాలకు అర్హుల గుర్తింపట!
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన!

జై తెలంగాణ అంటూ ట్వీట్ చేసారు.

Related Posts
ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
AP govt

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లులు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటించారు. Read more

JIO SMART GOLD: రూ. 10 లతో పెట్టుబడి పెట్టొచ్చు
jiogold

జియో ఫైనాన్స్ తాజాగా డిజిటల్ గోల్డ్ సేవలను ప్రారంభించింది, దీని ద్వారా వినియోగదారులు తమ యాప్‌లోని స్మార్ట్గోల్డ్ ఆప్షన్ ద్వారా నిమిషాల వ్యవధిలోనే వెండితెరకు అర్థం చేసుకునే Read more

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
President and Prime Minister paid tribute to the Mahatma

President and Prime Minister paid tribute to the Mahatma న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని Read more

రియల్‌మి GT 7 ప్రో ప్రీ-ఆర్డర్ వివరాలు: 18 నవంబర్ నుంచి ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభం
realme GT 7 pro

రియల్‌మి తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 7 ప్రోను భారత్‌లో నవంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ విడుదలకు ముందు రియల్‌మి Read more