Tenth Hall Tickets Available Today

నేడు అందుబాటులోకి టెన్త్ హాల్ టికెట్లు

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌.. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లను ఇవాళ వెబ్‌సైటులో అందుబాటులోకి తీసుకురానుంది. https://bse.telangana.gov.in/ సైట్‌లో విద్యార్థులు లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దాదాపు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సారి 10వ తరగతి పరీక్షల్లో కొత్తగా 24 పేజీలతో ఆన్సర్‌ షీట్‌ను ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. అడిషనల్‌ షీట్ ఇవ్వ‌రు. ఓఎంఆర్‌ షీట్‌ను తప్పులు లేకుండా సరిగా నింపాలని విద్యార్థులకు సూచించారు.

Advertisements
నేడు అందుబాటులోకి టెన్త్ హాల్

టెన్త్ క్లాస్‌ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ 2025 ఇదే..

.మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
.మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌
.మార్చి 24 – ఇంగ్లీష్‌
.మార్చి 26 – మ్యాథ్స్‌
.మార్చి 28 – ఫిజిక్స్‌
.మార్చి 29 – బయాలజీ
.ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌
.ఏప్రిల్‌ 3 – పేపర్‌-1 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)
.ఏప్రిల్‌ 4 – పేపర్‌-2 లాంగ్వేజ్‌ పరీక్ష (ఒకేషనల్‌ కోర్సు)

మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు!

తెలంగాణలో 2024–25 నుంచి 10వ తరగతి ప‌బ్లిక్ పరీక్షల విషయంలో విద్యాశాఖ కీలకమైన మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికారు. మళ్లీ పాత పద్ధతిలోనే మార్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. పరీక్ష హాల్లో విద్యార్థులకు ఇచ్చే ఆన్సర్‌ షీట్‌కు సంబంధించి కూడా మార్పులు చేశారు. కొత్త‌ విధానంలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇస్తారు. ఇందులోనే మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడిషనల్‌ షీట్ ఇవ్వ‌రు.

Related Posts
UNO: పహల్గాం దాడిని ఖండించిన భద్రతా మండలి
పహల్గాం దాడిని ఖండించిన భద్రతా మండలి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. Read more

అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు
అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఆయన Read more

Raja Singh : వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి
వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి

Raja Singh : వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలపాలని రాజాసింగ్ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లకు Read more

Accident: అదుపు తప్పి ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి
Accident: అదుపు తప్పి ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి

అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్కడికక్కడే Read more

Advertisements
×