హైదరాబాద్: పదోతరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పదోతరగతి పబ్లిక్ పరీక్ష, మార్చి 2025 హాల్ టిక్కెట్‌లు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2:00 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పింది. మీ పాఠశాల ద్వారా లాగిన్ చేసుకోవచ్చని తెలిపింది. మన మిత్ర, ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సేవల ద్వారా (9552300009), విద్యా సేవలను పొందవచ్చని పేర్కొంది. దరఖాస్తు సంఖ్య, విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

స్కూల్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఎస్సెస్సీ పరీక్షల హల్ టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి పొందవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. bse.ap.gov.in వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే వాట్సాప్‌లోని మనమిత్ర ద్వారా (9552300009)ఎడ్యూకేషనల్ సర్వీస్‌ను సెలెక్ట్ చేయడం ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేశారు. అప్లికేషన్ నెంబర్ లేదా విద్యార్థి ఐడీ, జన్మదిన తేదీ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు.
28వ తేదీన బయోలాజికల్ సైన్స్..
మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 22వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 24వ తేదీన గణితం, 26వ తేదీన ఫిజికల్ సైన్స్, 28వ తేదీన బయోలాజికల్ సైన్స్, 29వ తేదీన OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఒకేషన్ కోర్స్ (థియరీ), 31వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.