Supreme Court: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చాక వైసీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా వెలికితీస్తూ వైసీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court) ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీడీపీ రాజకీయ కక్షతో..
కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Peddireddy) తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన వాదనలతో ఏకీభవించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి.సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గానికి దూరం చేస్తోందని వవారు కోర్టుదృష్టికి తీసుకెళ్లారు.
మిమ్మల్ని ఎవరు ఆపగలరు? సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. ‘మిమ్మల్ని మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎవరు ఆపగలరు?’ అని ప్రశ్నించింది. భద్రత విషయంలో ఆందోళన ఉంటే, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే సమయంలో ఆయనకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసు భద్రతకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో ధర్మాసనం అంగీకరించింది. తాజా ఉత్తర్వులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో పర్యటించేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వైసీపీ నేతలపై పలు అవినీతి ఆరోపణ చేస్తూ, పలువురిని అరెస్టు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అనేకులను విచారించిన చంద్రబాబు ప్రభుత్వం మరికొందరిని అరెస్టు చేసే యత్నంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రజల బాధల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ, అభివృద్ధికి ఆమడదూరంలో పయనిస్తున్నారని అనేకులు విమర్శిస్తున్నారు.
పెద్దారెడ్డి ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు?
తనను తాడిపత్రిలోకి రానివ్వకుండా రాజకీయ కక్షతో ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ధర్మాసనం ఏ వ్యాఖ్యలు చేసింది?
“మిమ్మల్ని మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎవరు ఆపగలరు?” అని ప్రశ్నిస్తూ, భద్రత అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకోవాలని సూచించింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :