Movie: ఐస్ ఏజ్ యానిమేషన్ సినిమా(Animation Movie) గురించి తెలియని పిల్లలు ఉండరు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ భారీ వసూళ్లను సమకూర్చింది. ఈ సీరిస్ ను అత్యంత లాభదాయకమైన యానిమేటెడ్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిపాయి. తాజాగా ఐస్ ఏజ్ 6 విడుదలకు సిద్ధమవుతుంది. ఫిబవరి 5, 2027న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుందని డిస్నీ ధృవీకరించింది. ఈ అప్డేట్ను డెస్టినేషన్ 23 సందర్భంగా వెల్లడించారు. అంతేకాక డిస్నీ అధికారిక ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఈ పోస్టులో టీజర్ లైన్తో పాటు కొత్త టైటిల్ను కూడా తెలిపారు. ‘ఐస్ ఏజ్’ బాయిలింగ్ పాయింట్ను డెస్టినేషన్లో ప్రకటించారు.

పిల్లలతో పాటు పెద్దల్ని అలరించే మూవీ
కాగా ఐస్ ఏజ్ యానిమేషన్ మూవీ పిల్లలతోపాటు పెద్దల్ని బహుగా ఆకట్టుకుంది. మొదటి ఐస్ ఏజ్ ‘ది మెల్డన్ (2006), డాన్ ఆఫ్ ది డైనోసార్స్ (2009), కాంటినెంటల్ డ్రిఫ్ట్ (2012), కొలిషన్ కోర్స్ (2016)లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఊహించని కలెక్షన్లను సమకూర్చింది. కాగా నూతన మూవీలో రే రొమానో మరోసారి మానీ ది మముత్ పాత్రకు, క్వీన్ లతీఫ్ ఎల్లీ పాత్రకు, జాన్ గులెయిజామో సిడ్పాత్రకు, డెనిస్ లియరీ డెయెగో పాత్రకు, నైమన్ పెగక పాత్రకు స్వరాలు అందిస్తారు. లాస్ట్ వరల్డ్ లోకి లోతుగా అడుగుపెడుతున్నప్పుడు డైనోసార్,(Dinosaur) లావాతో నిండిన పిచ్చి సాహసం’ కలిగి ఉంటుందని అధికారక వివరణ చెబుతోంది. ఈ సినిమా ఆసాంతం ఆసక్తికరంగా ఆకట్టుకునే సన్నివేశాలతో పిల్లల్ని ఉర్రూతలూరించే సీన్స్ ఎన్నో ఉన్నాయి.
ఐస్ ఏజ్ 6 కొత్త టైటిల్ ఏమిటి?
ఈ చిత్రానికి “ఐస్ ఏజ్: బాయిలింగ్ పాయింట్” అనే టైటిల్‌ను ప్రకటించారు.
ఈ మూవీలో ఏయే పాత్రలకు మళ్లీ వాయిస్ ఇస్తున్నారు?
రే రొమానో – మానీ, క్వీన్ లతీఫ్ – ఎల్లీ, జాన్ లెగిజామో – సిడ్, డెనిస్ లియరీ – డియాగో పాత్రలకు స్వరమిస్తారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :