Telugu Moral stories : రామాపురంలో రామయ్య, రాములమ్మ అనే దంపతులు వుండేవారు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాము, చిన్నవాడి పేరు సోము.
రాము రోజూ బడికి వెళ్లి, చక్కగా చదువుకునేవాడు. సోము బడికి వెళ్లకుండా అల్లరి పిల్లలతో కలిసి తిరుగుతూ, విలువైన కాలాన్ని వృథా చేసేవాడు.
ఈ మధ్య సోములో వచ్చిన ఈ మార్పుకి అమ్మ, నాన్న తల్లడిల్లిపోయ sogaru. రాము బడికి వెళ్లి చక్కగా చదువుకుంటుంటే అమ్మ, నాన్నకి ఆనందం కలిగినా, సోము బడికి వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరగటం వల్ల అమ్మా, నాన్నకి చాలా బాధ కలిగించేది.

“రోజూ బడికి వెళ్లి చదువుకుంటే బతుకు బాగుపడుతుంది. భవిష్యత్తు బాగుంటుంది” అని అమ్మ, నాన్న, అన్న ఎన్నో సార్లు చెప్పారు. అయినా సోము మారకుండా అలాగే వ్యవహరించసాగాడు. సోము భవిష్యత్తు పాడైపోతుందనే బెంగతో అమ్మ, నాన్న చాలా దిగులుతో వుంటూ సోముతో ఇదివరకులాగా అభిమానంతో మాట్లాడలేక చాలా బాధతో వుండసాగారు.
ఇదివరకులా అమ్మ, నాన్న తనతో మాట్లాడకపోవడం, అన్న రాముతోనే మాట్లాడుతూ, అభిమానంగా వుండటం సోము గమనించాడు. సోముకి చాలా బాధ కలిగింది. ఈ విషయమే రాముతో సోము ఒకరోజు చెప్పాడు.
“దానికి కారణం నీకు తెలియదా? చదువుకోకుండా చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా వుంటారా? అభిమానంతో మాట్లాడతారా? వాళ్లేమన్నా బండలు పగలకొట్టమన్నారా? మట్టితట్టలు మోయమన్నారా? ఇంటెడు చాకిరి చేయమన్నారా? గొడ్లు కాయమన్నారా? ఒళ్లు హూనమయ్యేలా కూలిపనులు చేయమన్నారా?
నీకు, నాకూ ఏ కష్టం రాకుండా కడుపునిండా తిండి పెడుతున్నారు. కొత్త బట్టలు కుట్టిస్తున్నారు. బళ్లో ఫీజులు కడుతున్నారు. బాగా చదువుకోమని చెబుతున్నారు.Telugu Moral stories…

చదువుకోవటం ఏమన్నా కష్టమైన పనా? హాయిగా వెళ్లి చదువుకోవచ్చు కదా. నువ్వు ఆ పని చేయటం లేదు. బడికి వెళ్లి చక్కగా చదువుకుంటే మన బతుకులే బాగుపడ్డాయి. మనం బాగుపడటమే వాళ్లు కోరుకునేది. వాళ్లు కోరుకునే పని నువ్వు చేస్తున్నావా?
చేయటం లేదు. వాళ్లు బాధ పడకుండా ఎలా వుంటారు? నీతో అభిమానంతో ఎలా మాట్లాడుతారు? మన తిండికి, మన బట్టలకి, మన పుస్తకాలకి, మన ఫీజులకి.. ఇలా మన ఖర్చుల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు సంపాదిస్తేనే మనకు ఇవన్నీ సమకూరుతున్నాయి.
మనం కష్టపడకూడదని వాళ్లు కష్టపడని మనకి అన్ని సమకూరుస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? బడికి రాకుండా, చదువుకోకుండా, వాళ్ల కష్టార్జితమంతా దోచుకుతింటూ – నీ విలాసాలకి, నీ జల్సాలకి, వాళ్ల డబ్బునంతా మంచినీళ్లప్రాయంలా ఖర్చు పెడూ నువ్వు.
బాగుపడకుండా చెడిపోతూ వాళ్లని అంతులేని క్షోభకు గురి చేస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా?” అని రాము సోముకి హితబోధ చేసాడు.
అన్ని రాము మాటలకి సోము చలించిపోయాడు. పశ్చాత్తాపంతో కళ్ల నుంచి కన్నీళ్లు జలజలా రాలాయి. అన్నని అభిమానంగా కౌగిలించుకొని “నిజమే అన్నయ్యా! నేను చాలా తప్పు చేస్తున్నాను. నాకు బుర్తొచ్చింది. నీకులాగే రోజూ బడికి వెళ్తూ బుద్ధిగా చదువుకుంటాను. నీకు, అమ్మా నాన్నకి సంతోషం కలిగిస్తాను” అని సోము ఆ రోజు నుంచి బడికి వెళ్ళూ బుద్ధి చదువుకోవటం ప్రారంభించాడు.
సోము మారినందుకు రాము, అమ్మ, నాన్న ఎంతో ఆనందించారు. ఆ రోజు నుంచి వాళ్ల ఇంట్లో మళ్లీ పండుగ వాతావరణం ప్రారంభమయింది.(Telugu Moral stories)