మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.ఎన్నికల ముందు మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎంలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొత్త పెరుగుదలలు ప్రకటించడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరల పెంపు వెనుక ప్రభుత్వాల ఆదాయ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని, ధరలను తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి నేతలు స్పష్టంగా ప్రకటించారు. అయితే తాజాగా మద్యం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేయాలని నిర్ణయించడంతో మందుబాబులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మద్యం వ్యాపారంలో అవకతవకలను సరిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఎక్సెజ్ శాఖ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని అరికడతామని, మద్యం రేట్లు పెంచేది లేదని ఘాటుగా ప్రకటించారు. అయితే నెల రోజులకే 15% ధరలు పెంచడంతో ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు.
ప్రభుత్వాలు మద్యం విక్రయం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆశిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తామని నేతలు చెబుతున్నా, ప్రజలపై భారం వేయడం తగదని విమర్శలు వస్తున్నాయి. ఈ పెరుగుదలలతో మద్యపానంపై ప్రభావం పడుతుందా? లేదా వినియోగదారులు మరింత ఎక్కువగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారా? అన్నదానిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన హామీలు, తర్వాత తీసుకున్న నిర్ణయాలు మధ్య పొంతన లేకపోవడంతో విమర్శలు పెరుగుతున్నాయి. అధికారంలోకి రాగానే మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, రేట్లు పెంచడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారిందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.