Telugu Associations అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ

Telugu Associations : అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ

అమెరికాలోని తెలుగు సంఘాలతో జరిగిన చందాల వివాదం పెద్ద దుమారమే రేపింది. ఫెడరల్ నేషనల్ మార్ట్‌గేజ్ అసోసియేషన్ (ఫ్యానీ మే) తీసుకున్న తాజా నిర్ణయం అందరిని షాక్‌కు గురి చేసింది.ఈ వివాదం కారణంగా ఫ్యానీ మే సంస్థ ఏకంగా 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో అత్యధికంగా వర్జీనియా, డాలస్ ప్రాంతాలవారే ఉన్నారు. ముఖ్యంగా ఈ లేఆఫ్స్‌లో దాదాపు 200 మంది తెలుగువారు ఉండటం గమనార్హం.ఉద్యోగులు అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాలతో కలిసి మ్యాచింగ్ గ్రాంట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఓ ఉద్యోగి స్వచ్ఛంద విరాళం ఇస్తే, కంపెనీ అదే మొత్తాన్ని కలిపి విరాళం ఇవ్వడమే.అయితే కొన్ని సంఘాలకు తప్పుడు పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో బోగస్ విరాళాలు చూపించారట. ఈ నేపథ్యంలో తానా, ఆటా వంటి తెలుగు సంఘాల పేర్లు ఈ ఆరోపణల్లో వినిపిస్తున్నాయి.

Advertisements
Telugu Associations అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ
Telugu Associations అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ

FBI రంగంలోకి దిగింది

ఈ చందాల మోసంపై ఇప్పటికే FBI దర్యాప్తు మొదలుపెట్టింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు తానాలో రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నట్లు తెలిసింది. మరోరు ఆటా మాజీ అధ్యక్షుడి భార్య అని సమాచారం.నార్త్ కరోలీనా కోర్టు తానాకు సమన్లు జారీ చేసింది. 2019 నుండి 2024 వరకు అందిన విరాళాల రికార్డులు సమర్పించాలన్నది ఆదేశం.

ఫ్యానీ మే కఠిన నిర్ణయం

ఈ వివాదం నేపథ్యంలో ఫ్యానీ మే నైతికతను ప్రాముఖ్యతనిచ్చింది. మోసానికి పాల్పడ్డవారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇకపై ఇటువంటి చర్యలపై మినహాయింపు ఉండదని చెప్పింది.ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ల మోసం కేసులో ఆపిల్ సంస్థ కూడా గత ఏడాది 100 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలు సీరియస్‌గా తీసుకోవడంతో మిగిలిన కంపెనీలలో టెన్షన్ నెలకొంది.ఈ పరిణామాలు అమెరికాలోని ఎన్నో తెలుగువారిని కుదిపేశాయి. చెడ్డ పేరుతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చినా, కొన్ని సంఘాల తీరుతోనే ఈ దుస్థితి చోటుచేసుకుంది.

Read Also : Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన అమెరికా వాణిజ్య లోటు: ట్రంప్

Related Posts
బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu review of budget proposals

ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు పై చర్చ అమరావతి: ఈనెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర Read more

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల
YS Sharmila criticism of Botsa Satyanarayana

తనపై బొత్స చేసిన కామెంట్స్‌పై షర్మిల కౌంటర్‌ అమరావతి: వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ Read more

TGRTCకి సంక్రాంతి సీజన్‌లో కాసుల వర్షం
Sankranti Brought Huge Reve

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ప్రత్యేక బస్సులు నడిపి భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ సంబరాల కోసం 6 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి Read more

Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్
Cows గోమాతల్లో పవర్ ఉంటుంది పంజాబ్ గవర్నర్

Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గో సంరక్షణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×