అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరైన ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ పోరాటాలు అనేవి దేశీయంగా ఉండాలి తప్ప, అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి చర్యలు దేశ గౌరవాన్ని మంటగలుపుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “వారి తీరు చూస్తుంటే మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించిన జగన్, ప్రపంచ దేశాల ముందు మన రాజకీయ విభేదాలను పక్కన పెట్టి భారతీయులుగా ఐక్యంగా ఉండాలని హితవు పలికారు. దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టి చేసే రాజకీయాలు ఎవరికీ మేలు చేయవని ఆయన తన ట్వీట్లో స్పష్టం చేశారు.
Trump tariffs impact : ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం
మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ఘటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సులో ప్రసంగిస్తున్న సమయంలోనే, ఆయన స్వపార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి నిరసనలకు దిగడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఏఐ సమ్మిట్ వంటి మేధోమథన వేదికలను రాజకీయ నాటకాల కోసం వాడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమన్వయ లోపాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతోందని, సొంత పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడే క్రమశిక్షణ తప్పడం ఆ పార్టీ పతనానికి నిదర్శనమని కేటీఆర్ ఎక్స్ (X) వేదికగా ఎద్దేవా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com