నాలుగో సీజన్‌కు ముందు జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం (WPL 2026 Auction) లో, 277 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్న ఈ వేలంలో మొత్తంగా 67 మంది ప్లేయర్లను ఐదు ఫ్రాంఛైజీలు తీసుకున్నారు. ఇందులో 23 మంది విదేశీ ఆటగాళ్లు సైతం ఉన్నారు. మొత్తంగా అన్ని ఫ్రాంఛైజీలు కలిపి వేలం (WPL 2026 Auction) లో రూ. 40.8 కోట్లు ఖర్చు చేశాయి.
Read Also: WPL 2026 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం.. అన్‌సోల్డ్ జాబితా ఇదే!

ఈ వేలం (WPL 2026 Auction) లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణి (Nallapu Reddy Sricharani) ని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: