Women empowerment : మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణాను రోల్ మోడల్ గా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ప్రజాభవన్లో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తెలంగాణా రాష్ట్రానికి వచ్చే పరిస్థితిని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 46వేల చెరువులు చేప పిల్లల పెంపకానికి 122కోట్ల రూపాయలు విడుదల చేసామని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేసారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పెంపకం బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగి స్తున్నామని, ప్రభుత్వం ఆమేరకు కార్యాచరణ రూపొందిస్తుందని ఆయన తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఆదాయం సమకేర్చే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో మహిఇళల చేత పెద్ద ఎత్తున వ్యాపారం చేయించే ఆలోచన లో ప్రభుత్వం ఉందన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తున్నా మన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం: 21,600 కోట్లు వడ్డీలేని రుణాల పంపిణీ
ప్రతి సంవత్సరం 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేయాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించి మొదటి సంవత్సరంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ. 21,600లు కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. హైటెక్ సిటీ పక్కన శిల్పారామం వద్ద విలువైన స్థలాన్ని ప్రభుత్వం మహిళా సంఘాలకు (women’s groups) ఇచ్చి ఆర్ధికంగా వారిని ప్రోత్స హిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లో ఏర్పాటు ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్ర మహిళలు ఆర్థికంగా నిల దొక్కుకుని ప్రపంచంతో పోటీ పడాలని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పధకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు దోహద పడుతుం దన్న నమ్మకంతో ఉన్నామన్నారు. పది సంవత్సరాలు పాలించిన పాలకులు స్వయం సహాయక సంఘాల సభ్యులను గాలికి వదిలి వేసార న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలను, స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. బలమైన కుటుంబ వ్యవస్థ కేవలం మహిళల ద్వా రానే సాధ్యమవుతుందని అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :