News Telugu: వివాహబంధం ఎంతో పవిత్రమైనది. ఒకరికి ఒకరు తోడు ఉంటే ఇక ప్రపంచంతోనే పని ఉండదు. కడవరకు తోడుగా ఉండడం కంటే మరేమీ కోరని ఆత్మీయ అనురాగాల కోసమే కదా పెళ్లి అనే రెండక్షరాల బంధంలో ఇమిడిపోతున్నాం. అలాంటి మధురమైన బంధాలు క్షణికమైన సుఖాల కోసం కాలరాస్తున్నారు. ప్రియుడి కోసం, ప్రియురాలి కోసం కట్టుకున్న వారిని హతమారుస్తున్నారు. తద్వారా జైళ్లకు వెళ్తున్నారు. దీనితో పిల్లలు అనాధలుగా మారిపోతున్నారు. మన సమాజం ఎటుపోతున్నది? హత్యలు, ఆత్మహత్యలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం? ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ వార్తను మీరే చదవండి..
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన ఇల్లాలు
వారిద్దరు భార్యాభర్తలు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్ చిట్టికి 2009లో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. కూతురు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నది. అయితే చిట్టికి కొద్దిరోజుల క్రితం హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయడంతో, భార్యను మందలించాడు భర్త శేఖర్.
హత్య పథకం వేసిన భార్య
దీంతో చిట్టి ఎలాగైనా భర్తను హతమార్చి, ప్రియుడితో హ్యాపీగా జీవించాలని ఆశించింది. అందుకు ప్రణాళిక వేసింది. భర్త శేఖర్ పడుకున్న తర్వాత చిట్టి ప్రియుడు హరీష్ ను ఇంటికి రమ్మని పిలిచింది. ఇంట్లో ఉన్న కొడుకును వినాయకుడి వద్దకు వెళ్లి పడుకోమని పంపించింది. గాఢనిద్రలో ఉన్న భర్త శేఖర్ను హరీష్ గొంతునిలిమి హత్య (Throat-slitting murder)చేసేందుకు యత్నించాడు. అయితే శేఖర్ ప్రతిఘటించడంతో డంబెల్స్ తో తలపై కొట్టి చంపింది భార్య చిట్టి. ఉదయం కాగానే పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడని, ఉదయం చనిపోయాడని నాటకాలు ఆడింది చిట్టి. దీంతో పొంతనలేని సమాధాలు చెబుతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం చెప్పింది భార్య చిట్టి. దీంతో ప్రియుడు హరీష్, చిట్టిలను అరెస్టు చేసి, విచారణ చేస్తున్నారు పోలీసులు. తండ్రి చనిపోయి, తల్లి జైలు పాలు కావడంతో వీరి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: