జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో భారీ చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించేందుకు కష్టపడ్డారని కొనియాడారు.
Read Also: CM Revanth: కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: సీఎం
బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే
కానీ బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపించాయని, కొందరు నేతలు తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకే పనిచేశారని ఆరోపించారు.అందుకే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను చూసి బీజేపీ నాయకులు చాలా నేర్చుకోవాలని సూచించారు.

రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
వీరి కారణంగా పార్టీ అధికారంలోకి రావడం లేదని, పైగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎదగనీయడం లేదని ఆరోపించారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోవడం లేదని, కానీ పార్టీ పరిస్థితి చూసి బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నానని (Raja Singh) అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: