తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అనర్హులు లబ్ధి పొందడాన్ని నిలువరించాలని కీలక అడుగు వేసింది. ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు(Welfare Schemes) ఉండాలి. ఈ కొత్త విధానం గత వారం నుంచే మీ-సేవ కేంద్రాల్లో అమల్లోకి వచ్చింది.
Read Also: MHSRB: 1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

ఇప్పటి నుండి మీ-సేవలో ఆదాయ ధ్రువీకరణకు దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు లేని వ్యక్తులకు వెంటనే ‘Missing Food Security Card’ అనే సందేశం కనిపిస్తుంది. అంటే, ముందుగా రేషన్ కార్డు పొందిన తర్వాతే ఆదాయ ధ్రువీకరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అవినీతి, అనర్హుల అర్హతపై వచ్చిన ఫిర్యాదులే మార్పుకు కారణం
రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసే వారి పై రెవెన్యూ అధికారులు(Revenue officials) క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో అవినీతి, ఆలస్యం పెరిగి రూ.2,000–3,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో అనర్హులు కూడా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్,(Welfare Schemes) కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలలో లబ్ధి పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ నిర్ణయం వల్ల రేషన్ కార్డు లేని నిజమైన పేదలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తవచ్చు. అయినప్పటికీ, సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, లబ్ధి నిజమైన అర్హులకు మాత్రమే చేరేందుకు ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: