బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరిక జారీ చేసింది. అండమాన్ సమీపంలో మొదలైన ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ తూర్పు, మధ్య బంగాళాఖాతానికి చేరుకొని వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపారు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల రూపంలో కనిపించే అవకాశం ఉందని సూచించారు.ప్రస్తుతం ఈ అల్పపీడనం సముద్రం పైభాగంలో ఆవిరి సేకరణను పెంచుతూ వాతావరణాన్ని అస్థిరంగా మార్చుతోంది. ఫలితంగా తెలంగాణ (Telangana) లోని అనేక జిల్లాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండగా, నేటి నుంచే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
భారీవర్షాలు పడే అవకాశం ఉందని
రాబోయే రెండు నుంచి మూడు రోజులలో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

రాష్ట్రంలో వర్షాలు
గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాలోని మాగనూరులో అత్యధికంగా 3.13 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 2.74 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా కేంద్రీకృతం కావడంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. నైరుతి గాలులు పొడిబారిపోవడం కూడా వర్షాలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు పేర్కొన్నారు.
వర్షం ఎలా ఏర్పడుతుంది?
సూర్యకిరణాల వేడితో నీరు ఆవిరై వాయుమండలంలోకి వెళ్తుంది. ఆ ఆవిరి మేఘాలుగా మారి, చల్లని గాలులతో కలిసినప్పుడు నీటి బిందువులుగా కరిగి భూమి మీద పడుతుంది.
వర్షం వల్ల కలిగే నష్టాలేమిటి?
అధిక వర్షాల వల్ల వరదలు, నేల చరియలు, పంటల నష్టం, రోడ్లు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: