Minister Komatireddy : ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… ఎన్డీఎస్ఏ రిపోర్టు తాము బయట పెట్టలేదని.. వాళ్లే బయట పెట్టారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఒక నాసిరకం ప్రాజెక్ట్ అని విమర్శించారు. కాళేశ్వరం తన మానస పుత్రిక అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారని ఆరోపించారు. తెలివి ఉన్న ఎవరైనా కాళేశ్వరం చేపడతారా అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా?
కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం 8వ వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాగోతం బయటపడిందని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు కట్టకుండా.. కమీషన్ల కోసం వేరే చోట ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్డీఎస్ఏకు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని విచారణకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్ట్‌పై కేటీఆర్‌కు అవగాహన లేదని, ఆయన మాట్లాడకపోవడం చాలా మంచిదని అన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే విఫలం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్ అధికారులే చెప్పారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Read Also: హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు నోటీసులు