వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రైతు రమేష్ నాయక్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వ్యవసాయానికి అత్యవసరమైన ట్రాన్స్‌ఫార్మర్ (Transformer) గత నెల రోజులుగా కాలిపోయి మరమ్మత్తులు జరగకపోవడంతో తాను పూర్తిగా నష్టపోయానని పేర్కొన్నాడు.రైతు రమేష్ నాయక్ (Ramesh Nayak) డీడీ చెల్లించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారులను పలుమార్లు కలిశాడు.
ఆయన చివరికి
పంట వేసే సమయం ముగియనుండగా, కరెంట్ అందకపోవడం వల్ల సాగు పనులు చేయలేక తీవ్రంగా నిరాశ చెందిన ఆయన చివరికి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధికారుల కళ్లముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.వ్యవసాయానికి (Agriculture) అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన అందించాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరంగల్‌కు ప్రత్యేకత ఏమిటి?
వరంగల్ నగరం తన చారిత్రక ప్రాముఖ్యత, కళలతో నిండిన కాకతీయ రాజవంశానికి సంబంధించిన స్థలాలతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఎంతో గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని కలిగి ఉంది.
వరంగల్ పాత పేరు ఏమిటి?
వరంగల్ పాత పేరు ఒరుగల్లు లేదా ఒరకల్ గా ప్రసిద్ధి. ఈ పేరు తెలుగు పదాలైన “ఒరు” (ఒకటి), “గల్లి” లేదా “కల్లు” (రాయి) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే “ఒకే రాయి పట్టణం” అనే అర్ధం వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Breaking news: తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు