Indiramma housing issues : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ
భూభారతి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫైళ్ళు లేదా టెక్నికల్ సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని జిల్లా స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.(Indiramma housing issues) రాష్ట్ర స్థాయి విచారణ లేదా అనుమతులు అవసరమైన అంశాలను సంబంధిత సెక్రటరీలు, శాఖా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం స్వయంగా కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Saudi Arabia: మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
తరువాత కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతి, పెండింగ్ సమస్యలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదయ్య, కీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మరియు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :