వైరస్ తో ఎండిపోతున్న చెట్లు ఫోమోస్పీస్ అనే శిలీంధ్రం వ్యాప్తి
హైదరాబాద్ : సహజసంజీవని అయిన వేప నేడు ప్రకృతి వైపరీత్య ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది. తెలంగాణ, (Telangana) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంతకాలంగా వేపకు వైరస్ (Virus) సోకుతుండడంతో జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. చెట్టంతా నిలువెల్లా ఎండిపోతూ ఆకులన్నీ రాలిపోతున్నాయి. గత మూడేళ్లుగా వేపకు వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలానికి కొన్ని చెట్లు విరిగి చిగురించగా, కొన్ని పూర్తిగా ఎండిపోయాయి. నేడు వేపకు అదే దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వేపచెట్లు వైరస్ సోకి ఎండి పోతున్నాయి. ఆకులు, కొమ్మలు ఎండిపోవడం, కొన్ని చోట్ల గోధుమ వర్ణంలోకి మారడం కనిపిస్తోంది. ఇలా తెగుళ్లు సోకి మూడు నెలల్లోనే వేప చెట్టు నిర్జీవంగా తయారవుతోంది. ఈ వైరస్ వచ్చాక చెట్టు ఆకులు, చిగుళ్లు, కొమ్మల నుంచి ఎండిపోయినట్టుగా ముదురు ఇటుక రంగులో ఉంటూ కిందకు పాకు తుంది. అందుకే దీన్ని డై బ్యాక్ డిసీజ్ అని పిలుస్తారు.
Read also: Hyderabad crime: ప్రేమ ఒత్తిడితో యువతి ఉరి వేసుకుని మృతి

లొరాంథస్ పరాన్న మొక్క ప్రధాన కారణం
ఇది శిలీంధ్రం వల్లే వస్తుంది కానీ, మస్కిటో డీ బగ్ అనే ఒక రకమైన కీటకం కాటు వేసిన చోట, శిలీంధ్రం వ్యాపిస్తుంది. (Virus) వర్షాకాలం ప్రారంభంలో పెరుగుతుంది. ఆగస్టులో పెరిగి అక్టోబర్ నవంబ ర్లో బాగా ఎక్కువ అవుతుంది. ఎండలు ప్రారంభం అయ్యాక తగ్గుతుంది. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. శిలీంధ్ర రేణువులు గాలి ద్వారా వ్యాపిస్తాయి. అలాగే ఒక చెట్టుపై వాలిన కీటకాలు మరో చెట్టుపై వాలినా వస్తుంది. వర్షం నీరు ఒక చెట్టు నుంచి జారి మరో చెట్టపై పడినప్పుడు కూడా వస్తుంది. చెట్టు పెద్దదా చిన్నడా, వయసు ఎంత అనే దాంతో నిమిత్తం లేకుండా వ్యాపిస్తుండడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోయి కన్పిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్ల ఆకులు పూర్తిగా పచ్చదనం కోల్పోగా మరి కొన్ని చోట్ల వైరస్ ఇప్పుడిప్పుడే ప్రభావం చూపుతోంది. ఫోమోస్పీస్ ఆజాలడిక్స్ అనే శిలీంద్రం సోకడంవల్ల వేవకు ప్రమాదం ఏర్పడిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా లొరాంథస్ నే సమస్యతో వేప చెట్టు చిగుళ్లు ఎండిపోతున్నాయి.
మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై లొరాంథస్ట్ అనే పరాన్న మొక్క ఎదగడమే ఇందుకు కారణమని సైంటిస్టులు గుర్తించారు. భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలు తదితరమైన వాటిని పీల్చుకొని అన్ని భాగాలను ఎండిపోయేలా చేస్తుంది. దాంతో చెట్టు కూలిపోతుంది. అంతేకాకుండా లొరాంథస్ వ్యాపించడంతో వేప చెట్టుకు తగిన సూర్యరశ్మి సోకదు. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్ ను గుర్తించిన వెంటనే. చెట్టును మొత్తం కొట్టేయకుండా, సదరు కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా శాఖలకు వ్యాపించకుండా కాపాడవచ్చని అప్పటో అధికారులు చర్యలు చేపట్టారు.
వ్యాధి నివారణపై శాస్త్రవేత్తల పరిశోధనలు
గతేడాది కూడా ఇదే తీరులో ఎండిపోయాయి. (Virus) అప్పుడు తీసుకున్న చర్యలతో వైరస్ భారి నుంచి బయట పడ్డాయి. ఇటీవల కొద్ది నెలలుగా మళ్లీ వైరస్ భారిన పడి ఎండిపోతున్నాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ ఎండిపోతుండడంతో అసలు వేవ చెట్లు ఎందుకు 20 ఎండిపోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగరీకరణలో కాంక్రీట్ నిర్మాణాల వల్ల చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందడం లేదు. దీని వల్ల కూడా చెట్లు క్రమంగా అంతరిస్తున్నాయి. గృహ నిర్మాణాల సమయాల్లో, విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని ఒకవైపు చెట్టు కొమ్మలను నరికేయడం వల్ల భారమంతా ఒకేవైపు పడి అవి నేలకూలుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలా వేప చెట్లు ఎండిపోతుండడంపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రోగ నిర్ధారణ విభాగం శాస్త్రవేత్తలు ఏడాది నుంచే పరిశోధనలు చేస్తున్నారు. తెగులు నివారణపై విస్తృతంగా ప్రయ త్నాలు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: