Vegetable Crisis : రాష్ట్రంలో వినియోగించే కూరగాయలకు సంబంధించి ఉద్యాన శాఖ వైఫల్యంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. జనాభా అవసరాలకు తగినట్లుగా రాష్ట్రంలో కూరగాయల సాగు జరగడం లేదు. రాష్ట్రంలో కొరత ఉన్న కూరగాయలను ప్రోత్సహించి, వాటిని సాగు చేయించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా రాష్ట్ర అవసరాల్లో 60 శాతం ఇతర రాష్ట్రాల (Other states) నుండే దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కూరగాయల సాగు చేసేందుకు ప్రోత్సాహం లేక, తగిన సమాచారం, సలహాలు ఇచ్చేవారు లేక వాటి సాగు పట్ల రైతాంగం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చివరకు పచ్చి మిర్చికి కూడా ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది.
తెలంగాణలో కూరగాయల కొరత: ధరలు పెరుగుదలపై ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా 3.10 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు అవుతున్నట్లు ఉద్యాన శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి 42 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా 23 లక్షల టన్నులు మాత్రమే సాగవుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 లక్షల టన్నుల కూరగాయల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా పంటలు అధికంగా పండే తెలంగాణలో ప్రస్తుతం కాయగూరలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వేసవిలో అన్ సీజన్లో 60 శాతం నుండి 70 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి. సాగు ఎక్కువగా జరిగే అక్టోబరు నుండి మార్చి వరకూ మాత్రమే 50 శాతం కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలోనే మహారాష్ట్ర నుండి క్యాలీఫ్లవర్, రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుండి టమోటాలు, ఉత్తరప్రదేశ్ నుండి పచ్చిమిర్చి తెలంగాణ రాష్ట్రంలోకి (State of Telangana) వస్తోంది. శ్రీలంకలో సంక్షోభం కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి ఆ దేశానికి టమోటాలు, ఇతర కూరగాయలు సరఫరా అవుతుండడంతో తెలంగాణలో కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

టమోటా, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి
ఇందులో భాగంగా జైపూర్ నుండి టమోటాలు, ఉత్తరప్రదేశ్లోని సంబాల్ మార్కెట్ నుండి పశ్చిమిర్చి, మహారాష్ట్ర నుండి క్యాలీఫ్లవర్ హైదరాదాబాద్ సహా తెలంగాణలోని పలు పట్టణాలకు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో కూరగాయల ధరలు గత నెలతో పోలిస్తే చెప్పకోదగ్గ స్థాయిలో పెరిగాయి. నెల క్రితం కిలో 10 రూపాయలకు అమ్మిన టమోటా ప్రస్తుతం హైదరాబాద్లో క్వాలిటీని బట్టి 150 రూపాయలు పలుకుతోంది. బోడ కాకరకాయలు అయితే కిలో 400 రూపాయలు, మిర్చి 130 రూపాయలు, ఇక బీరకాయ, బెండకాయలు తదితర కూరగాయలు అన్నీ కిలోకు 60 రూపాయల పైబడి ధరలు పలుకుతున్నాయి. ఇక క్యాబేజీ విషయానికి వస్తే అన్ని రాష్ట్రాల నుండి హైదరాబాద్కు 1,650 క్వింటాళ్లు వస్తోంది. అయితే ఇటువంటి కూరగాయలను తెలంగాణలోనే పండించే అవకాశం ఉన్నా ఉద్యాన శాఖ నిర్లక్ష్యం కారణంగా ఇతర రాష్ట్రాలే దిక్కవుతున్నాయనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :