హైదరాబాద్(Hyderabad) పోలీసు శాఖలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పష్టం చేశారు. స్వల్పమైన అలసత్వం కూడా ఒప్పుకోబోమని, అవసరమైతే సస్పెన్షన్ వంటి చర్యలు కూడా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: Sitakka: BRS దీక్షా దివస్ ఓ నాటకం అన్న సీతక్క

సజ్జనార్ కీలక ఆదేశాలు
కమిషనరేట్‌లో జరిగిన నేరాల సమీక్షా సమావేశంలో సజ్జనార్(VC Sajjanar) కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్‌కి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని వెంటనే స్పందించి ఎఫ్‌ఐఆర్(First information Report) నమోదు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. కేసులను పట్టించుకోకపోవడం, నేర తీవ్రతను తగ్గించి చూపడం వంటి చర్యలను అస్సలు సహించబోమని ఆయన హెచ్చరించారు.
ప్రధాన కేసుల దర్యాప్తును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(Central Investigation Team)’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రగ్స్, ఆన్‌లైన్ గేమింగ్, సైబర్ నేరాలు, మహిళల భద్రత, వీధి నేరాలు, ఆహార కల్తీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
స్టేషన్‌ను సందర్శించే మహిళలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో అనేకమంది అడిషనల్ సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: