హైదరాబాద్(Hyderabad) నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో(VC Sajjanar) విస్తృతమైన నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కమిషనరేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. నగరంలో భద్రతను మరింత పటిష్ఠం చేసే ఉద్దేశంతో రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా ఈ తనిఖీలను ముమ్మరం చేశారు.
Read also: ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

5,000 మంది సిబ్బందితో ఏకకాలంలో తనిఖీలు
ఈ ‘ఆపరేషన్ కవచ్’ డ్రైవ్‌లో సుమారు 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో పాల్గొంటున్నారని కమిషనర్(VC Sajjanar) తెలిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా ఇందులో భాగమయ్యాయి. నగరంలోని 150 కీలక ప్రాంతాలలో ఈ ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నగర పౌరులు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: