హైదరాబాద్: బిసి కమిషన్ చైర్మన్ గా సేవలందించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ బిజెపిలో చేరారు. సోమవారం బిజె పి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు (N. Ram Chandra Rao) పార్టీ కండువా కప్పి స్వాగతించి, ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, రాజ్యసభసభ్యుడు ఆర్. కృష్ణయ్యలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామరావ్ పాటిల్, డా. పాల్వాయి హరీష్ బాబు, సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎంపి సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంబిసి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
బిసిలకు న్యాయం చేయగల పార్టీ బిజెపి: వకులాభరణం
సందర్భంగా వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ బిసిలకు నిజమైన న్యాయం చేయగల పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు. తెలంగాణ లో బిసి రిజర్వేషన్ల (BC Reservations) ను మతపరమైన ముస్లిం రిజర్వేష న్లుగా మార్చే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకునేది బిజెపి మాత్రమే. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారికంగా జనగణనతో పాటు కులగణన చేపట్టబోతున్న ఏకైక పార్టీ అన్నారు. నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు వేస్తున్న బిజెపిలో చేరడం ప్రజలకు నిజాయితీతో సేవ చేసే అవకాశం వస్తుందనే నా విశ్వాసం అని తెలంగాణ బిసి కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్రావు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: