హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి (Uttam Kumar) కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 ఆవార్డ్ల పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర శాసనసభలోని రాబీలో తన ఛాంబర్లో మీడియా చిట్బాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ మాజీ మంత్రి హరేష్ రావు చూపిస్తున్న లేఖ సి.డబ్ల్యూ.సి అంతర్గతంగా సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమే నని, ఎంత మాత్రం సి.డబ్ల్యు.సి ఆయన స్పష్టం జరిగిన ఆమోదించినట్లు కాదని చేశారు.
Read also: Telangana: 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ

జల నిబంధనల ఉల్లంఘన: ఉత్తమ్
తెలంగాణా రాష్ట్ర (TG) బల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బిఆర్ఎస్ పార్టీ పూనుకుందని పార్టీ నాయకులు రేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఆయన కొట్టి పారేశారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణా. ((Uttam Kumar) రాష్ట్ర ప్రభుత్వం జీఆర్యాంబి, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీలతో పాటు కేంద్ర జం కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణా ప్రభుత్వ అభిప్రాయంతో పైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 4న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు. అంతటితో ఆగకుండా భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే ప్రాజెక్టును ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆక్షేపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది జభిషేక్ సింగ్విని నియమించిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర సంస్థలకు అభ్యంతర లేఖలు
అయితే సోమవారం (5వ తేదీ జరగాల్సిన వాదనలు వర్చే సోమవారం(12వ తేదీకి) రోజుకు వాయిదా పడ్డాయని ఎపి ప్రతిపాదనలు జల నిబంధనలను ఉల్లంఘించడమే రిట్ పిటిషన్ ను సూట్ పిటిషన్ గా మార్చి దాఖలు చేయాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే సోమవారం జరగనున్న వాసనలకు స్వయంగా తాను హాజరు అవుతాడని, మళ్ళీ స్టే ఆర్డర్ కోరతామని ఆయన తెలిపారు. ఇదే విషయమై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను విజయం విలువరించడంలో సాదించమన్నారు.
బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ వడిన విషయాన్ని తెలంగాణా సమాజం గుర్తించుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫల మయ్యారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బిఆర్ ఎస్-పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని ఆయన విమర్శించారు. జూరాల నుండి పాలమూరు. ఎత్తిపోతల పధకాన్ని శీశైలంకు, తుమ్మిడిహట్టి నుండి మెడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పధకం కింద తుమ్మిడ్విట్టి ప్రాజెక్టును రీ డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని బిఆర్ఎస్ పాలకులు మోపాదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి దుయ్యబట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: