Urea Shortage : తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడం బాధాకరమని, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ, వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పాలనలో రైతుల గౌరవం, కాంగ్రెస్‌లో అవస్థలు
హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు గౌరవంగా జీవించారని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం క్యూలలో నిలబడి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు,” అని పేర్కొంటూ, ప్రభుత్వం రైతుల కష్టాలను ఎప్పుడు తీరుస్తుందని ప్రశ్నించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :