హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరతా (Urea deficiency) ఏర్పడి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిలుకర రవికుమార్ ఆరోపించారు. ప్రభుత్వాలకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఒక్క యూరియా బస్తా కోసం తిండి తిప్పలు లేక క్యూలైన్లు కడుతున్నారని ఏ రాష్ట్రంలో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు ఉందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా
గతంలో యూరియాను నిలువవుంచి రైతులకు ఎన్ని బస్తాలైనా అందజేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని. రైతులు ఒక్క యూరియా బస్తా కోసం రోడ్డు ఎక్కే దుస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి ఇస్తున్నట్లు ప్రకటించిందని ఇది సరిపోదని రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇచ్చి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి బండి సంజయ్ లు మిగతా బిజెపి ఎంపీలు యూరియా కొరతపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: