కుటుంబ కలహాల నేపథ్యంలో ఉప్పల్ బిజెవైఎం నేత రెవల్లి రాజు ఆత్మహత్య
హైదరాబాద్ (ఉప్పల్) : ఉప్పల్ బిజెవైఎం (Uppal BJYM) సీనియర్ నేత రెవల్లి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా కుటుంబ సమ స్యలతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కుటుంబంలో జరిగిన గొడవను సెల్ ఫోన్లో విడియోతీసి కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తల్లిని కొడుతు న్నట్లు చిత్రీకరించి ప్రధాని మోడీ ఫొటో జతచేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆయన తీవ్రకలత చెంది గురువారం రాత్రి తాను చనిపోతున్నట్లు విడియో తీసి స్నేహి తులకు పంపించారు. దీంతో బంధువులు ఉప్పల్ పిఎస్లో మిస్సింగ్ కేసు పెట్టారు.
Read also: అమెరికా నగరంలో భారీ పేలుడు

సోషల్ మీడియాలో వైరల్ వీడియోతో కలత – రాజకీయ కక్షల ఆరోపణలు
బంధువులు స్నేహితులు పలు ప్రాంతాల్లో గాలిస్తుండగా శుక్రవారం ఉదయం బీబీ నగర్ లోని చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు సమాచారం అందింది. అక్కడికివెళ్లి చూడగా మృతుడు రెవల్లి రాజుగా గుర్తించారు. రాజకీయ కక్షతోనే రెవల్లి రాజును కొందరు సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరించారని బిజెపి (BJP) నేతలు ఆందోళనకు దిగారు. మృతదేహంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహిస్తారని హెచ్చరించడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువులు, పార్టీ (Uppal BJYM) నేతలను పోలీసులు నచ్చచెప్పారు. కాగా దీనిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: