హైదరాబాద్ : రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను ఈ నెల 18 నుండి యదావిధిగా నిర్వహించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Tummala Nageswara Rao) జిన్నింగ్ మిల్లులకు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి సీసీఐతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం విధించిన నిబంధనలను సడలించాలని సూచించారు. కేంద్ర జౌళిశాఖ అధికారులతో హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలసి పాల్గొన్నారు.
Read Also: Bangladesh: హసీనా ఉరిశిక్ష తీర్పుతో చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి

ఈ సందర్భంగా మాట్లాడుతూ తేమ శాతం మరియు ఎకరానికి విధించిన కొను గోలు పరిమితులపై సమీక్షించాల్సిందిగా కేంద్రానికి సూచించారు. కేంద్రం(center) పెట్టిన నిబంధనలతో రైతులకు దిక్కతోచని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇంతకు ముందు పెసళ్లు, కందులు, పొద్దు తిరుగుడ వంటికి 25 శాతం పరిమితి పెట్టడం తో మిగిలిన వాటిని తక్కువ ధరకు అమ్ముకోవల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుడదనే ఉద్దేశంతో రాష్ట్రమే మద్దతు ధర చెల్లించి, గత రెండు సంవత్సరాల నుండి మిగిలిన పంటలను కొనుగోలు చేస్తోందని వెల్లడించారు.
పత్తి దిగుబడి గణాంకాలను సీసీఐకి పంపినట్లు పేర్కొన్నారు. తేమశాతం నిబంధనతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిన్నింగ్ మిల్లుల విభజనతో పత్తి కొనుగోళ్లు జరపాలనే నిర్ణయంపై మొదటి నుంచి తీవ్రఅంసతృప్తితో జిన్నింగ్ మిల్లుల ఉన్నాయని చెప్పారు. కొనుగోళ్ళు ఆరంభమై నెల రోజులు గడిచినప్పటికి, ఇప్పటికి కేవలం 243 మిల్లులు మాత్రమే రైతులకు కేటాయించడం, తద్వారా మిగతా 82 మిల్లులు ఇంకా తెరుచుకోకపోవడం, దీంతో రైతులు చాలా దూరం వెళ్లి పత్తిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: