తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు హైకోర్టు డివిజనల్ బెంచ్ నుండి కీలక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షలపై ఉత్పన్నమైన వివాదంపై డివిజనల్ బెంచ్ కీలకంగా స్పందించింది.
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే
గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో, గ్రూప్ 1 తుది మార్కుల జాబితా మరియు జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు దిగి డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజనల్ బెంచ్ (Divisional Bench)ఈ రోజు విచారించిన అనంతరం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది. ఇది టీఎస్‌పీఎస్సీకి భారీ ఊరటగా భావించబడుతోంది.
తదుపరి విచారణ తేదీ నిర్ణయం
ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 15కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులు కొన్ని అనుమానాల నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ర్యాంకుల ప్రకటనలో పారదర్శకతలేమి వంటివి ప్రధాన అంశాలుగా ఉండగా, వాటిని పరిశీలించిన సింగిల్ బెంచ్ ఆదేశాలివ్వడం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: