తెలంగాణ (Telangana) రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB APP Exam), తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీని ప్రకటించింది. బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏపీపీ రాత పరీక్షను డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ జోన్ 1కి 50 పోస్టులు, మల్టీ జోన్ 2కి 68 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి.
Read Also: HYD: సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

పరీక్ష షెడ్యూల్ వివరాలు:
- పేపర్ 1: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు.
- పేపర్ 2: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 6 (రేపటి) నుండి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు సూచించింది.
తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు ఇఫ్లూలో విదేశీ భాషా కోర్సులు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 1,700 మంది నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఆధ్వర్యంలో వీరికి జపాన్ మరియు జర్మనీ భాషల్లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు.
16 నెలల శిక్షణలో ఇంగ్లీష్‌తో పాటు జపనీస్ లేదా జర్మన్‌లో ఏదైనా ఒక భాషను నేర్పేలా ఇఫ్లూతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 నర్సింగ్ కాలేజీలు, 6 నర్సింగ్ పాఠశాలల విద్యార్థులు ఈ విదేశీ భాషా కోర్సులను నేర్చుకోనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: