తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రం (Telangana State), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ అనే 32 ఏళ్ల యువకుడు గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.విద్యాసాగర్ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం అతనిని ఢీకొట్టింది. వాహనంపై ఉన్న ఇద్దరు యువకుల చర్యపై విద్యాసాగర్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ సమయంలో యవకులు మితిమీరిన చర్యకు పాల్పడ్డారు.

కత్తితో దాడి చేసి పరార్
వివాదం తారాస్థాయికి చేరడంతో ఆ యువకులు తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేశారు (Vidyasagar was attacked with a knife). అతన్ని తీవ్రంగా గాయపరిచి అక్కడినుంచి పరారయ్యారు. ఈ దాడిని చూసిన అక్కడి భక్తులు వెంటనే విద్యాసాగర్‌కు సాయం చేసి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు శక్తి ప్రయత్నించినప్పటికీ విద్యాసాగర్ గాయాల తీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు. భక్తుడి మృతి విన్న గ్రామస్థులు దిగ్భ్రాంతి చెందారు. మృతుడి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
నిందితులు అరెస్టు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని తమిళనాడుకు చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్‌గా గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.ఈ దాడి ఘటన యాదాద్రి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. శాంతియుతంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆవేదన కలిగిస్తోంది. భక్తుల భద్రతపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also : Murder : మెదక్ జిల్లాలో అన్నపై తమ్ముడి ఘాతుకం