హైదరాబాద్ లో ఏ సిగ్నల్ వద్ద చూసినా ట్రాఫిక్ పోలీసులు (Police) చేతిలో కెమెరాలతో నిలబడడం మనం
చూస్తుంటాం. రెడ్ లైట్ పడి, వాహనాలు వెళ్తుంటే ఇక వెనకనుంచి కెమెరాలు క్లిక్.. క్లిక్ మని ఫొటోలు
తీసి, వాహనదారులకు పంపుతున్నారు. లేదా సిగ్నల్ ను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తే వెంటనే
చలన్లరూపంలో పైన్ పడుతుంది. ఏ చిన్న తప్పిదం చేసినా తమ కెమెరాలకు పనిచెబుతూ, వారినుంచి
చలాన్ల రూపంలో డబ్బును వసూలు చేస్తున్నారు.
Read Also: Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘జన నాయగన్’

ద్వజమెత్తిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
ఇదే విషయంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా ఘాటుగా విమర్శించారు. ట్రాఫిక్ పోలీసులు చలాన్లను వసూలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారని, పోలీసులకు టార్గెట్ ఇచ్చి మరీ చలాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం వేయుస్తున్నదా? అని ఆయన ద్వజమెత్తారు. అంతేకా వీధిలైట్లు (స్ట్రీట్ లైట్లు) వెలగడం లేదు, రోడ్లు బాగుపడడం లేదు, శబ్దకాలుశ్యం అదుపులో లేదు. వీటిపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదుకానీ, వాహన చలాన్లపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దూకుడుగా పనిచేస్తున్నారని అక్బరుద్దీన్ ఘాటవ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి చలాన్ల రూపంలో కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నదని, దాన్ని ఏం చేస్తున్నారని,
రోడ్ల స్థితిగతులు ఏమాత్రం బాగుపడడం లేదని అక్బరుద్దీన్ దుయ్యబట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: