ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు(TPCC) ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోషంగా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవి కోరుతున్నాననే వార్తలను ఆయన ఖండించారు. నేను పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తని, పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని నిబద్ధతతో నిర్వర్తిస్తాను అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ, తాను మంత్రి పదవి కోసం ఆశపడటం లేదని ఆయన స్పష్టంచేశారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ నాకు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఎలాంటి దూరం లేదు. మంత్రివర్గం మొత్తం నాకు సహకరిస్తోంది. పార్టీ పట్ల నాకు ఉన్న కట్టుబాటు వల్లే ఈ స్థాయికి వచ్చాను అని తెలిపారు.
Read also: చదువులో టాపర్ నుంచి ఉగ్రవాదిగా మారిన లేడీ డాక్టర్ కథ ఏంటి?

బీజేపీపై ఓటు చోరీ ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో(TPCC) బీజేపీ ఓటు చోరీ చేసి అనేక స్థానాల్లో గెలిచిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్‌లో ఓటు చోరీ జరిగినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఓల్డ్ సిటీలో ఫిరోజ్ ఖాన్ ఇప్పటికే కొన్ని ఆధారాలను బయటపెట్టారని తెలిపారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వచ్చే అవకాశమేమీ లేదని, దానం నాగేందర్ స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరారని వివరించారు. అదేవిధంగా, ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ నిఘా విఫలమైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: