కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓద్వారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజూ వెళ్లే ఒక రిటైర్డ్ ఉద్యోగితో అక్కడి పూజారి సాయి తరుణ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ అమాయక భక్తుడికి తిరుపతి శ్రీవారి దర్శనం చేయిస్తానని, రైలు టిక్కెట్లు బుక్ చేస్తానని నమ్మబలికాడు. భక్తితో నమ్మి ఫోన్ ఇస్తే, ఆ పూజారి మాత్రం పక్కా ప్లాన్‌తో భారీ దోపిడీకి తెరలేపాడు.
Read also: Bhadreshkumar Patel: భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

Karimnagar crime: Priest who took 18 lakhs in the name of darshan
లక్షల రూపాయలు మాయం చేసిన వైనం
టిక్కెట్ల బుకింగ్ సాకుతో బాధితుడి మొబైల్ ఫోన్ తీసుకున్న పూజారి, చాకచక్యంగా బ్యాంకింగ్ పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. లావాదేవీలకు సంబంధించిన మెసేజ్లు రాకుండా సెట్టింగ్స్ మార్చి, సుమారు 30 విడతల్లో రూ.18.46 లక్షలను తన అనుచరుడైన హరీష్ ఖాతాకు బదిలీ చేశాడు. ప్రతిరోజూ ఉదయం వేళల్లో రూ.99,999 చొప్పున విడతల వారీగా నగదు కాజేశాడు. బాధితుడు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ చూసుకునే వరకు తన అకౌంట్ ఖాళీ అయిన విషయం తెలియకపోవడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: